బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
పోచంపల్లి బ్యాంకు చౌటుప్పల్ బ్రాంచ్ 14 వార్షికోత్సవం
పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ కర్నాటి బాలసుబ్రహ్మణ్యం
జ్ఞాన తెలంగాణ, (చౌటుప్పల్ )
పోచంపల్లి కో ఆపరేటివ్ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని
పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ కర్నాటి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. భువనగిరి నియోజకవర్గం చౌటుప్పల్ పట్టణంలోని పోచంపల్లి కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ 14 వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఖాతాదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ బాలసుభ్రమణ్యం మాట్లాడుతూ కార్పొరేట్ బ్యాంకులు అందిస్తున్న సేవల కన్నా ఎక్కువ గా పోచంపల్లి బ్యాంకు ఖాతాదారులకు అందించడం జరుగుతుందని ఆ సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని అన్నారు.పోచంపల్లి ఏటీఎం నిరంతరాయంగా పనిచేస్తుందని, బస్ స్టేషన్లోని ఏటీఎం ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, వివిధ రకాల రుణాలను వెంటనే అందజేస్తున్నామని ఆయన వివరించారు. ఖాతాదారుల కు అందిస్తున్న మెరుగైన సేవలతో పోచంపల్లి బ్యాంక్ ఈ ప్రాంతంలో విశేష ప్రాచుర్యాన్ని పొందిందని ఆయన అన్నారు. బ్యాంక్ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ఖాతాదారులు, అందుకు సహకరిస్తున్న సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో బ్యాంక్ సీఇవో సీతా శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ కడవేరు రాజు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.