ఆర్ ఎస్ పి మద్దతుగా ప్రచారం చేస్తున్న స్వేరోస్

ఆర్ ఎస్ పి మద్దతుగా ప్రచారం చేస్తున్న స్వేరోస్
జ్ఞాన తెలంగాణ: నాగర్ కర్నూల్ (దుస్స.కుమార్)
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన విషయం తెలిసిందే, పార్లమెంట్ పరిధిలోని
అన్ని నియోజకవర్గ స్థానాల్లో స్వేరోస్ మరియు ఆర్ఎస్పీ అభిమానులు ప్రచారం లో నిమగ్నమయ్యారు అన్ని జిల్లాల నుండి తమ అభిమాన నాయకుడు స్వేరోస్ నెట్వర్క్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు,
ప్రచారంలో ఆర్ఎస్పీ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు గుణాత్మకమైన మరియు విప్లవాత్మకమైన మార్పుల గురించి వివరిస్తూ చట్ట సభల్లో పేద వర్గాల తరఫున పోరాడే వ్యక్తిత్వం మరియు మాట్లాడే గొంతుక అవసరం అని, ఆర్.ఎస్.పి గారు గెలిస్తే పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో విద్య మరియు అన్ని నియోజకవర్గాల్లో విద్య వైద్య సదుపాయాలు మరింత మెరుగ్గా నాణ్యమైనవిగా ప్రజలకు మరింత చేరువయ్యేలా చేస్తారని, కేంద్రం పరిధిలో ఉండే నవోదయ స్కూల్స్,కేంద్రీయ విద్యాలయాలు,స్పోర్ట్స్ అకాడమీలు వచ్చేలా కృషి చేస్తారని,
హర్వర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి ఆర్ఎస్పీ గారు అని ఆలోచన చేసి పార్టీలకు అతీతంగా మొదటి 1 గుర్తు కార్ పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గడప గడపకు ప్రచారం చేస్తున్నారు…
ఆర్ స్పీ గారి విజయం చేరువలో
స్థానిక నాయకుడు కావడం,
పది సంవత్సరాలు అధికారం లో ఉన్న పార్టీ,తెలంగాణ సాధించిన చరిత్ర కలిగిన బలమైన నాయకుడు కేసీఆర్ గారి బలం
బలమైన క్యాడర్,
స్వేరోస్ మరియు ఆర్ స్పీ టీం,
అభిమానులు ప్రచారం లో దూసుకెళ్తున్నారు..
బిఆర్ ఎస్ నాయకుల పూర్తి సపోర్ట్ ,సహకారం..