స్వేరో ఆదర్శ వివాహము
స్వేరో ఆదర్శ వివాహము
జ్ఞాన తెలంగాణ ,నవాబుపేట్:

నవాబు పేట్ మండల పరిధిలోని చించల్పేట్ గ్రామానికి చెందిన పులుసు మామిడి నవీన్ కుమార్ వివాహానికి ముఖ్యఅతిథిగా కేంద్ర యువ సాహిత్య అవార్డు గ్రహీత, స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసునూరి రవీందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే,బాబా సాహెబ్ అంబేద్కర్, శ్రీ నారాయణ గురు,పెరియార్ రామ్ స్వామి, సాహు మహారాజ్ మహనీయుల అడుగు జాడల్లో నడుస్తూ..వారి వివాహం వచ్చే తరాలకు ఆదర్శం కావాలని అన్నారు.
ఆ వేడుకలో లక్నపురం శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి బాబూరావు, చార్మినార్ జోన్ ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్, జిల్లా అధ్యక్షులు కె రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి యం.
శ్రీనివాస్, సలహాదారులు వెంకటయ్య, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాయింట్ సెక్రటరీ నర్సింలు,బహుజన సమాజ్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ సెక్రటరి మీనాల్లి ప్రభాకర్, నవాబుపేట మండల బీఎస్పీ నాయకులు చించల్పేట్ సెక్టర్ మాల శేఖర్ మాణిక్యం,వినోద్,నర్సింలు,అజయ్ కుమార్, కడిచర్ల సుధాకర్,ముకురం కుమార్,ముకురం రాజు ,చెంచలం రాజు హాజరు అయ్యారు.