చందుపట్ల లో సుబ్బురు సత్తయ్య అంత్యక్రియలు

చందుపట్ల లో సుబ్బురు సత్తయ్య అంత్యక్రియలు
హాజరైన ప్రముఖులు
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారి సతీమణి బీర్ల అనిత తండ్రి సుబ్బురు సత్తయ్య గారు అనారోగ్యంతో మృతిచెందారు.
ఆదివారం రోజు ఉదయం 11:00గంటలకు భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో స్వర్గీయ సుబ్బురు సత్తయ్య గారి అంత్యక్రియలు నిర్వహించారు..
ఈ అంత్యక్రియలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మందుల సామేల్,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,ఎంపి అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,క్యామ మల్లేష్,బండ్రు శోభారాణి సత్తయ్య గారి ఆత్మ శాంతి చేకూరాలని నివాళులర్పించారు.ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.