రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవి రెడ్డి పై సస్పెన్షన్ తొలంగిపు

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవి రెడ్డి పై సస్పెన్షన్ తొలంగిపు
జ్ఞాన తెలంగాణ మే 2, ఖమ్మం జిల్లా ప్రతినిధి: రామసహాయం మాధవి రెడ్డి సస్పెన్షన్ తొలగించిన గౌరవ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖమాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధవి రెడ్డి కి కాంగ్రెస్ కండువా కప్పి తిరిగి పార్టీ లోకి ఆహ్వానిస్తూ ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘరామ్ రెడ్డి విజయానికి కృషి చెయ్యాలని తెలిపారు.ఈ సందర్భంగా తన సస్పెన్షను తొలగించి పార్టీ లో కొనసాగే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి, రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి శ్రీమతి రామసహాయం మాధవి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు, శ్రీమతి రేణుకా చౌదరి మరియు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వం లో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘరామ్ రెడ్డి విజయం కొరకు పని చేస్తాను అన్నారు.