ఏప్రిల్ 26, 27న పొద్దుటూరులో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్

జట్లకు నమోదు గడువు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే!
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామము, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా లో తెలంగాణ రాష్ట్ర క్రీడ అయిన కబడ్డీకి మద్దతుగా, పొద్దుటూరు గ్రామ అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, 27 తేదీలలో అనగా శని, ఆదివారాల రోజుల్లో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబోతోంది. ఇందులో పాల్గొనదలచిన జట్లు ఈరోజు (ఏప్రిల్ 25) సాయంత్రం 5 గంటల లోపు తమ జట్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు సూచించారు. గడువు అనంతరం కొత్తగా నమోదు చేసుకునే అవకాశాలు ఉండవని తెలిపారు.
ఈ టోర్నమెంట్‌ను తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అనుమతితో నిర్వహించబోతున్నామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కబడ్డీ జట్లు నిరభ్యంతరంగా పాల్గొనవచ్చునని నిర్వాహకులు తెలిపారు. మట్టి మైదానంలో నిర్వహించబోయే ఈ పోటీల్లో ప్రో కబడ్డీ స్థాయి నిపుణులైన రిఫరీలు అందుబాటులో ఉండడం సంతోషించదగిన విషయమని ఈ సందర్భంగా వారు అన్నారు.
పోటీలో పాల్గొనబోయే క్రీడాకారుల కోసం చక్కటి భోజన వసతిని కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈరోజుల్లో కబడ్డీ క్రికెట్ తరువాత ప్రజల్లో పెద్ద స్థాయిలో ఆదరణ పొందుతున్న క్రీడగా ఎదుగుతోందని, ఈ పోటీలు క్రీడలపట్ల యువతలో ఉత్సాహాన్ని పెంపొందించడమే కాకుండా, గ్రామీణ క్రీడాకారులకు రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటుకునే వేదికగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
టోర్నమెంట్ స్థలం: పొద్దుటూరు హై స్కూల్ ప్రాంగణం, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా
సంప్రదించవలసిన నంబర్లు:
ఎం యాదయ్య:9381003039
ఎన్ మల్లేష్: 79814 38997
పోటీ తేదీలు: ఏప్రిల్ 26 (శనివారం), 27 (ఆదివారం)
నమోదుకు చివరి గడువు: ఏప్రిల్ 25 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందని ఓ ప్రకటనలో తెలియజేశారు.