కీIIశేII సాంబరాజు రవికి ఘన నివాళులర్పించిన టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

కీIIశేII సాంబరాజు రవికి ఘన నివాళులర్పించిన టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
జనగామ జిల్లా , జఫర్ గడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ అధ్వర్యంలో 11-6-2024 మంగళవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కీశే సాంబరాజు రవి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. భౌతికంగా వారు మా మధ్యన లేకున్నా రజక జాతికి చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.
కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అశోక్, సూరారం మాజీ సర్పంచ్ మేడిపల్లి శ్రీనివాస్,చిట్యాల ఐలమ్మ మనుమలు చిట్యాల రామచంద్రం, సంపత్, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు రాపర్తి సోమన్న,నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్,మిన్నలపురం జలేంధర్, రాష్ట్రసంయుక్త కార్యదర్శి ఏదునూరి వీరన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీకొండ రాజు, కళామండలి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యామంకి యుగేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉల్లెంగుల యాదగిరి మాజీ సర్పంచ్,జిల్లా సీనియర్ నాయకులు ఉల్లెంగుల రాములు, జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి యాకన్న,జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, జిల్లా కార్యదర్శి ఉల్లంగుల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఉల్లెంగుల చంద్రశేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడాల రాజు, జిల్లా ప్రచార కార్యదర్శి కొన్నె ఉపేందర్, జిల్లా ముఖ్య సలహాదారు మెంతన కిష్టయ్య, దర్శనాల లక్ష్మణ్ మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు రాజకీయ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.