ఉపాధి హామీ చట్ట రక్షణకై 10న జరుగు రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి


జ్ఞాన తెలంగాణ వలిగొండ జూన్ 7

ఉపాధి హామీ చట్ట రక్షణ కోరుతూ ఈనెల 10వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేక పోరాటాల ద్వారా ఏర్పడిందని అలాంటి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలను చేస్తుందన్నారు చట్ట రక్షణ కోసం మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సదస్సుకు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సహాయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శివ దాసన్ అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ముఖ్య వక్తలుగా హాజరవుతారని తెలిపారు ఉపాధి హామీ చట్టంలో గతంలో ఉన్న పద్ధతులను తీసివేస్తూ నూతన పద్ధతులను అవలంబిస్తూ కూలీలు పనులకు రాకుండా కొర్రీలు పెడుతున్నది రెండు పూటలా ఫోటోలు అప్లోడ్ చేస్తేనే వేతనాలు ఇస్తామని వేధింపులకు గురిచేస్తుంది పనిచేసిన కూలీలకు వారం వారం డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంచడంతో కూలీలు తగ్గడం వల్ల చట్టాన్ని రద్దు చేయాలని దురుద్దేశంతో ప్రభుత్వం ఉన్నది రోజు కూలి 600 రూపాయలు ఇచ్చి 200 పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఈ సదస్సులో వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో వ్యవసాయం సంఘం మండల కార్యదర్శి కలుకూరి రామచందర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కందగట్ల సాయి రెడ్డి, కొండూరి సత్తయ్య, గండికోట నరసింహ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »