సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,జులై 10 :

గురుపౌర్ణమి సందర్భంగా సతీ సమేతంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసురుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఆలయం,కల్కి చెరువు వద్ద సాయిబాబా ఆలయం, బాన్సువాడ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి – శ్రీమతి పుష్ప దంపతులు.
శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం గురువులు, శారద ఉపాసకులు శ్రీ శ్రీ శ్రీ మంగళ గిరి నరసింహ మూర్తి ( చేర్యాల స్వామీజీ ) గారి ఆశీర్వాదం తీసుకున్న పోచారం.
పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు.

You may also like...

Translate »