రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక పూజలు

రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక పూజలు
కార్పొరేటర్లు బైగళ్ల బాలమని, అక్కి మాధవి, రామచందర్
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
మహేశ్వరం నియోజకవర్గం
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బైగళ్ల బాలమణి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం జిల్లేలాగుడా గ్రామంలోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ కార్పొరేటర్లు బైగళ్ల బాలమని,అక్కి మాధవి,గజ్జల రామచందర్,కో ఆప్షన్ సభ్యులు జంగయ్య గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు సామిడి గోపాల్ రెడ్డి,చల్లా బాల్రెడ్డి, సిద్దాల శ్రీశైలం,బైగళ్ల ఓం ప్రకాష్ , రవి గౌడ్,కాళ్ళ కుమార్,సంతోష్,సిదేశ్వర్ చారి,పరశురాం మహిళా నాయకులు పద్మా తదితరులు పాల్గొన్నారు.
