ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టి గూడెం & మద్దివారిగూడెం ప్రత్యేక పంచాయతీ విభజన గ్రామ సభ
-గ్రామ సభకు హాజరైన కార్య నిర్వహణ అధికారి ఖమ్మం రూరల్ ఎంపీ ఓ రాజారత్నం గ్రామ సెక్రెటరీ తిలక్ కిషోర్ రజిత
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టి గూడెం గ్రామ పరిధిలో ఉన్న నాలుగు ఉమ్మడి గ్రామాలు గాను మొన్న నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర నివేదిక ప్రకారం గ్రామ సభలో విభజించడం జరిగినది అందులో భాగంగానే పోలిశెట్టి గూడెం మద్దివారిగూడానికి గాను విభజన గాను కొద్దిమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఆ గ్రామసభను అడ్డుకోవడం జరిగినది ఆ రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలు వారి యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మాకు ప్రత్యేక పంచాయతీ కావాలి అనే గ్రామస్తులు తొలుత పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలవడం జరిగినది మా యొక్క మూడు గ్రామాలకు రేషన్ బియ్యం కానీ గ్రామ సచివాలయం కానీ గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి ఎలాంటి నిధులు కూడా మా యొక్క గ్రామ అభివృద్ధికి సరిపోవడం లేదని ఆ గ్రామ ప్రజలు వాపొహించడం జరిగినది అట్టి ఉన్నత అధికారులను పలుమార్లు ఆ యొక్క గ్రామ ప్రజలు కలవడం వల్ల వారు వారి యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు యధావిధిగా గ్రామసభను ఖమ్మం రూరల్ ఎంపీఓ రాజారత్నం గారి ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించడం జరిగినది అట్టి గ్రామసభలో గ్రామస్తులు అందరిని వారి యొక్క నిర్ణయాన్ని ఏకాభిప్రాయాన్ని సేకరించి ఈ యొక్క పంచాయితీ విభజించడం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటి అని తెలుసుకొని వారి సమక్షంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామపంచాయతీ పెద్దలు గ్రామ అధికారులు సుమారుగా గ్రామ సభకి 212 మంది హాజరై ప్రత్యేక పంచాయితీ ఏక తీర్మానాన్ని ఎంచుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని పార్టీల మద్దతు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసారపు శ్రీనివాసరావు, అల్లం వీరారెడ్డి, వడ్డే రామయ్య, శ్రీనివాసరావు, సాబాదు రాజు,కళ్ల వెంకటరెడ్డి షాబాద్, వెంకటరెడ్డి అదేవిధంగా BRS పార్టీకి సంబంధించిన వడ్డే వెంకటేశ్వర్లు తన్నీరు నవీను ధర్మారెడ్డి, పుల్లారెడ్డి, మల్లారెడ్డి, బట్టు లక్ష్మయ్య, జంగం వెంకన్న, మాధవ రెడ్డి, యాకయ్య, పెంటల కోటయ్య, CPI పార్టీ కి సంబంధించి కొయ్య సీతయ్య, తొట్ల మల్లయ్య, అరికోట్ల జోజి, TDP పార్టీ కి సంబంధించి కళ్యాణపు రామారావు, వడ్డే కొండయ్య, వాంకుడోత్ వీర్య, ఎల్లవల సీతారాములు, CPI(ML) మామిడాల వెంకటేష్, ఎస్ కే సాలు, ఎస్.కె అజీర్ పాషా, BSP పార్టీ కి సంబంధించి బచ్చలకూరి బాలరాజ్ హెచ్ శశి కుమార్ గ్రామ ఉన్నతాధికారులు మరియు గ్రామ ప్రజలు నరేష్, యాకయ్య, శ్రావణ, సురేష్, మధు, లింగయ్య, నరసయ్య, గోవిందు, లాలు, జానారెడ్డి, కొండ బాలకృష్ణ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ సిబ్బంది ఉదయ్ కుమార్, పిట్టల నాగయ్య, సాయిలు, జయరాజు, తదితరులు పాల్గొన్నారు