కోర్టు విధులు పకడ్భందీగా నిర్వహించాలి
కోర్టు విధులు పకడ్భందీగా నిర్వహించాలి
జ్ఞాన తెలంగాణ, నారాయణపేట:

నారాయణపేట జిల్లాలోని కోర్టు డ్యూటీలు నిర్వహించే, పోలీసులు తమ విధులు పకడ్బందీగా నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను అదేశించారు.
శనివారం ఎస్పీ కాన్ఫిరెన్స్ కార్యాలయంలో జిల్లాలో కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌతమ్ యోగేష్ మాట్లాడుతూ..దొంగలను పకడ్బందీగా కోర్టు ముందు హాజరు పరచాలని, అన్యాయాన్ని అరికట్టాలని సూచించారు. సమయానికి , క్రిమినల్ కేసులు ,కోర్టుకు సాక్ష్యాలు, వాంగ్మూలాలు, సంబందించిన ఆధారాలు సక్రమంగా సమర్పించాలని చెప్పారు.
