తండ్రి వివాహం చూడలేదని కర్రతో హత్య చేసిన కొడుకు

తండ్రి వివాహం చూడలేదని కర్రతో హత్య చేసిన కొడుకు


జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి టౌన్‌:
తండ్రి తనకు వివాహ సంబంధాలు చూడటం లేదని అసహనంతో కొడుకు కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ..మెట్‌పల్లిలోని బోయవాడకు చెందిన గంగ నర్సయ్య (55) ప్రతి రోజు మాదిరిగానే ఈ ఉదయం ఇంట్లో ధ్యానం చేస్తున్నాడు. ఈ సమయంలో అతని కుమారుడు అన్వేష్ (28) వచ్చి “నాకు వివాహం ఎందుకు చూడడం లేదు” అని వాదనకు దిగాడు. మాటామాట పెరగడంతో కోపోద్రిక్తుడైన అన్వేష్ పక్కనే ఉన్న కర్రతో తండ్రి తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన గంగ నర్సయ్య రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు.

సమీపంలో ఉన్న అక్క హారిక భర్త నరేష్‌కు ఫోన్ చేసి ఘటనను తెలిపిన అన్వేష్ ఆ దంపతులు అక్కడకు చేరుకుని గాయపడిన నర్సయ్యను మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పబ్బ కిరణ్‌కుమార్ తెలిపారు.

You may also like...

Translate »