గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్:

గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్:
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:
జిల్లాలోని గ్రూప్-1 పరీక్ష కేంద్రాలను ఆదివారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సురభి మెడికల్ కాలేజ్, మిట్టపల్లి వెల్కటూర్ ఎక్స్ రోడ్ TGSWRS గర్ల్స్ జూనియర్ కాలేజ్లలో పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు పర్యవేక్షించారు.
