అక్టోబర్ 31న పలు రైలు సర్వీసులు రద్దు.

అక్టోబర్ 31న పలు రైలు సర్వీసులు రద్దు.
సికింద్రాబాద్: ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా దక్షిణ మధ్య రైల్వే మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు మరికొన్నింటిని దారి మళ్లించామన్నారు.
హెచ్ఎస్ నాందేడ్ సంబల్పూర్ తిరుపతి పూరీ స్టేషన్ల మధ్య నడుస్తున్న రైళ్లను మంగళవారం వరకు రద్దు చేశారు వాస్కోడిగామా షాలీమార్ హైదరాబాద్ షాలీమార్ చెన్సై సెంట్రల్ షాలీమార్ మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లను విజయవాడ, బలార్షా చందాఫోర్ట్ జర్సుగూడ ఖరగ్పూర్ మీదుగా దారి మళ్లించారు.