కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు: మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు: మాజీ ఎమ్మెల్యే

– జ్ఞాన తెలంగాణ హన్మకొండ ప్రతినిధి:

వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. మంగళవారం నాడు బాలసముద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వారి పంటలు ఎండిపోతున్నాయన్నారు . పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »