సీత్ళా పండుగ ప్రకృతి ని ఆరాధించే సాంప్రదాయ పండుగ

సీత్ళా పండుగ ప్రకృతి ని ఆరాధించే సాంప్రదాయ పండుగ.

— లంబాడి ఐక్య వేదిక రంగారెడ్డి జిల్లా విధార్థి విభాగం సమాన్యకర్త- రాజేష్ చౌహన్

బంజారా సోదర సోదరీమణులందరికీ సీత్ళా భవాని పండుగ శుభాకాంక్షలు.

జాతి ఐక్యతను చాటుదాం.

(బంజారాలు) ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ

రంగారెడ్డి జిల్లా: గిరిజనులైన లంబాడీలు (బంజారాలు) ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ. రేపు 09-07-2024 మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బంజారా వాసులందరూ సీత్ళా భవాని పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించాలని సూచిస్తూ, సీత్ళా భవాని పండుగ ప్రపంచం మొత్తంలో నివసిస్తున్న లంబాడీలు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ. ఈ పండుగ బంజారా ఔన్నత్యాన్ని చాటుతుంది. ఈ పండుగ పంటపొలాలు సాగుచేసే ప్రారంభంలో ప్రారంభమవుతుంది. దీనిని ఆషాఢ మాసం లో ఒక మంగళవారం జరుపుతారు. ఇది ప్రతీ సంవత్సర మంగళవారం నాడే జరపడం ఆనవాయితి. ఈ పండగలో భాగంగా తాండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవానిని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు,మేకలతో, మహిళలు, యువతులు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశానికి వెళ్తారు.ఈ క్రమంలో అందరు కలిసి పాటలు పాడుతారు. సీత్ళా భవానీ దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు (ఘుగ్రీ), పాయసం (లాప్సీ) సమర్పిస్తారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. అలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా భవానీ కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటివి పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, పాడి పంటలు బాగా పండుతాయని, అటవీ సంపద తరగకూడదనీ, సీత్ల తల్లికి మొక్కులు తీర్చు కుంటారు. దేవతను పూజించే క్రమంలో పెద్ద మనిషిని పూజారిగా ఉంచి అతని చేతుల మీదగా కార్యక్రమం నిర్వహిస్తారు.

You may also like...

Translate »