ఎంబీబీఎస్ లో పేద విద్యార్థినికి సీటు

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, సెప్టెంబర్ 30 :
మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన పేద విద్యార్ధిని బొజ్జ శ్రీనిధి ఈ ఏడాది జరిగిన నీట్లో ప్రతిభను కనబరిచి మెడిసన్ లో సీటు సాధించింది. బొజ్జ సైదులు, సంధ్యారాణి కూతురు శ్రీనిధి 1నుంచి 10 వరకు నల్లగొండ, ఇంటర్ హైదరాబాద్ లో చదివింది. శ్రీనిధి నీట్ పరీక్షలో 2,45,346 ర్యాంకుతో వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా కింది ఎంబీబీఎస్ సీటు సాధించింది. 2024లో మొదటి ప్రయత్నంలో బీడీఎస్ లో సీటు వచ్చినా తీసుకోలేదు. కార్డియాలజిస్ట్ కావాలనే కొరికతో పాటు పేదలకు సేవా చేయాలనే సంకల్పంతో రెండో వయత్నంలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సాధించిన శ్రీనిధిని తల్లిదండ్రులతో పాటు, కళాశాల అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు

You may also like...

Translate »