మోగిన బడి గంటలు…

మోగిన బడి గంటలు…
జ్ఞాన తెలంగాణ మొయినాబాద్ జూన్ 12:-
వేసవి సెలవుల ముగియడంతో ఇక రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకున్నాయి. దింతో పాఠశాలలో బడి గంటలు మోగాయి వేసవి సెలవులో సేదాతిరిన విద్యార్థులు బడి పాట పట్టారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న స్పెషల్ అధికారి జీ లక్ష్మి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, మంచి సౌకర్యాలతో అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయని ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిద్దిదాలని వారిని ఉన్నతంగా ఎదిగేలా దిశనిర్దేశం చేయాలని పాఠశాల యాజమాన్యానికి సూచనలు చేశారు. విద్యార్థులు కుడా బాగా చదివి పాఠశాలకు మరియు గ్రామానికి వారి తల్లితండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని హితాబోధ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, ప్రభుత్వ ఉన్నత & ప్రాథమిక పాఠశాల అధ్యాపకులు మరియు అంగన్వాడీ టీచర్స్,విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.