అర్హులైన వారందరికీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు చేయాలి

బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని
అర్హులైన వారందరికీ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి పథకాలు అమలు చేయాలి.
అర్హులైన వారికి దక్కని ప్రభుత్వ పథకాలు
బిఆర్ఎస్ నాయకులకే పరిమితమైన దళిత బంధు బీసీ బందు గృహ లక్ష్మీ పథకాలు
పథకాలలో ఎమ్మెల్యే నాయకులు చెప్పిన వారికే అమలు
పథకాలలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోకూడదు అన్న హైకోర్టు అయినా వారు చెప్పిన వారికే పథకాలు అమలు చేస్తున్న అధికారులు
అర్హులైన వారందరికీ పథకాల అమలు చేయకుంటే ఎమ్మెల్యే క్యాంప్ అఫీస్ ముట్టడిస్తాం
బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో అర్హులకు దళిత బంధు పథకాన్ని మరియు బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలు అర్హులైన వారందరికీ అమలు చేయాలనీ బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. అర్హులైన వారందరికీ దళిత బంధు పథకంలో అన్ని విధాల అర్హత ఉన్న వారికి ఇవ్వకుండా అధికార పార్టీకి చెందిన వారికే దళిత బంధు పథకాన్ని పెద్ద ఎత్తున కమిషన్లు మాట్లాడుకుని వారు చెప్పిన వారికి దళిత బంధు స్కీమును ఇవ్వడం జరుగుతుంది. అలా అధికార పార్టీ వారి స్వార్థం కోసం అర్హులైన వారికి దళిత బంధు ను రాకుండా చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ వారి కోసమే నా అర్హులైన వారి కోసం కాదా ? అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బంధు గృహలక్ష్మి పథకాలలోనూ అధికార పార్టీకి చెందిన నాయకులదే హవా కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు సామాన్యులకు కాదా? అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు వారి అనుచరుల కేనా? ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని దళిత బంధు గృహలక్ష్మి బిసి బంధు లో అన్ని అర్హతలు ఉన్న వారికి ఎటువంటి కమిషన్లు రాజకీయ నాయకుల జోక్యం అవసరం లేకుండా అర్హులైన ప్రతివారికి పథకాలన్నీ అమలు చేయాలి. అర్హులైన వారికి దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి పథకాలను అమలు చేయకుంటే బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.