రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది.

ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది.

29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.

You may also like...

Translate »