ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలి

ఫిబ్రవరి 3 న వేయి గొంతులు – లక్ష డప్పులు మహా ప్రదర్శన ను విజయవంతం చేయండి


ఫిబ్రవరి 3 న హైదరాబాద్ కు లక్షలాదిగా తరలిరండి

NY అశోక్ మాదిగ
కళమండలి జాతీయ అధ్యక్షులు

ఎమ్మార్పీఎస్ ఎమ్మె ఎస్ పి మరియు అన్ని అనుబంధ సంఘాల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ ఏర్పాటు

ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటోనోళ్ల నరసింహ మాదిగ అధ్యక్షతన జరిగింది


జ్ఞాన తెలంగాణ షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 30:

MRPS వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న MRPS జాతీయ కళమండలి జాతీయ అధ్యక్షులు NY అశోక్ మాదిగ, మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మంద కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ముప్పై ఏళ్లుగా రాజీలేని పోరాటం చేయడం జరిగింది అని అన్నారు.మాదిగల పొరటంలోని న్యాయబద్దతను గ్రహించి సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలియజేస్తూ చారిత్రక తీర్పును ఇచ్చిందని అన్నారు. సుదీర్ఘ పోరాటం వల్ల దక్కిన విజయ ఫలాలను అందుకునే సమయంలో ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి మాల సామాజిక వర్గంలోని కొంత మంది స్వార్థపరులు కుట్రలకు తెరలేపారు. ఆ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మాదిగ ప్రజల మీద ఉందని అన్నారు.అందువల్లే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకుల కుట్రలను ఎదుర్కోవడానికి మాదిగ కళానేతలతో వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.ఇన్నేళ్ళు సమాజ వికాసం కోసం మోగిన డప్పులు ఈ సారి జాతి విముక్తి కోసం మోగబోతున్నాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణను లోకమంతా అంగీకరిస్తుంటే ఒక్క మాల కులస్తులే అడ్డుపడుతుండడం దారుణమని అన్నారు.ఎస్సీ వర్గీకరణ వల్ల ఏ కులానికి అన్యాయం జరుగదు అని అన్నారు.అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయ స్ఫూర్తికి ఎస్సీ వర్గీకరణ అద్దం పడుతుందని అన్నారు.కనుక ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడమంటే అంబేద్కర్ ను వ్యతిరేకించడమే అవుతుందని అన్నారు. వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంతో వర్గీకరణ వ్యతిరేకుల కుట్రలను తిప్పి కొడతామని అన్నారు.ప్రతి గ్రామం నుండి డప్పులను సంకకు వేసుకొని లక్షలాదిగా మాదిగ బిడ్డలు వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమానికి తరలిరావాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో MSP ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ మద్దిలేటి మాదిగ, MSP జిల్లా అధ్యక్షులు రావుగాళ్ల బాబు మాదిగ, MSP మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కేశపగా రామచందర్ మాదిగ, MSF ఉమ్మడి జిల్లా ఇంచార్జి భైరపోగు శివకుమార్ మాదిగ, MRPS ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ గట్టగల్ల ప్రశాంత్ మాదిగ, MRPS మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పంగ ప్రణయ్ మాదిగ, MSP సీనియర్ నాయకులు శంకర్ మాదిగ, బక్కని రవి, కలమండలి నాయకులు అంబేద్కర్, MRPS జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణ మాదిగ, కళా నాయకురాలు మీనా, జిల్లా ఉపాధ్యక్షులు తుడం కిరణ్ మాదిగ, MSP మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూర స్వామి మాదిగ, MSF జిల్లా అధ్యక్షులు భాను మాదిగ, MRPS కొందుర్ మండల్ అధ్యక్షులు ఆనందు మాదిగ, MSP సీనియర్ నాయకులు గణేష్ మాదిగ, సంజీవ మాదిగ, శ్రీకాంత్ మాదిగ తదితరులు పాండు, అశోక్, బాలు మాదిగ, మహేందర్, నాగా భూషణ్ మాదిగ పాల్గొన్నారు.

You may also like...

Translate »