ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి

కెసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవాలి లేదంటే దళితుల సత్తా చూపిస్తాం కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ
చేవెళ్ల : మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ అని ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని చట్టబద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కేంద్రం అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ పార్టీలు 29 సంవత్సరాలు గా తేల్చకుండా మాదిగలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ బిజెపి ఓట్లు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్న అభివృద్ధి ఆర్థిక స్థితిగతులను మార్చే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికలు దళితుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివ శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చేగురి వెంకటేష్ మండలాల కన్వీనర్లు శ్రీనివాస్, ఊరెంట ప్రవీణ్ కుమార్ మాదిగ, ఉపాధ్యాయులు శేఖర్, మండల సీనియర్ నాయకులు చేవెళ్ల మహేందర్, గడ్డమీది శ్రీనివాస్ ,రవి, రమేశ్,ఎం ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వన్నేపాగ వంశీ, యాదయ్య,
కె మాణిక్య,కె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.