ఎస్సీ వర్గీకరణ సాధన – మంద కృష్ణ మాదిగ అలుపెరగని పోరాట ఫలం

  • ఎస్సీ వర్గీకరణ సాధన – మంద కృష్ణ మాదిగ అలుపెరగని పోరాట ఫలం
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి న్యాయాన్ని సాధించిన కృష్ణ మాదిగ
  • మాదిగల ఆత్మగౌరవం కోసం మూడు దశాబ్దాల పోరాటం
  • తెలంగాణ మాదిగ విద్యావంతులకు నూతన ఆశను అందించిన వర్గీకరణ బిల్లు

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, మండల అధ్యక్షుడు ఉరెంట ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించి, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతాల శివశంకర్ మాదిగ, MSF రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ మాదిగ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “సామాజిక ఉద్యమాల సూర్యుడు, ప్రజానాయకుడు, మాదిగల ఆత్మగౌరవానికి మార్గదర్శి అయిన మంద కృష్ణ మాదిగ గారి మూడు దశాబ్దాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది” అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించేలా ఆయన తన నిరంతర పోరాటంతో మార్గం సుగమం చేశారని ప్రశంసించారు.

నేడు తెలంగాణలోని మాదిగ విద్యావంతులకు ఈ బిల్లు కొత్త భరోసా, ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తుందని, ఈ విజయాన్ని అందించేందుకు మూడున్నర దశాబ్దాలుగా మాదిగ అనుబంధ సంఘాలు చేసిన కృషిని గుర్తించాల్సిన అవసరం ఉందని నాని భానుప్రసాద్ మాదిగ తెలిపారు. “మాదిగలందరూ మంద కృష్ణ మాదిగ గారికి జీవితకాలం రుణపడి ఉంటారు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ఊరేళ్ళ అధ్యక్షులు గంగారం నరేష్, దమర్గీద్ద అధ్యక్షులు చందు, గుండాల అధ్యక్షులు మల్లేష్, ఘనపురం అధ్యక్షులు ఇదులపల్లి రాములు, మల్కాపూర్ అధ్యక్షులు శాంతి కుమార్, అల్లవాడ అధ్యక్షులు శివంగాళ్ల విజయ్ కుమార్, గొల్లపల్లి అధ్యక్షులు గాజులగూడెం వెంకటేష్, కందవడ అధ్యక్షులు మహేందర్, కోజ్జంకి సత్యనారాయణ, శివంగాళ్ల సత్యనందం, చేవెళ్ల రమేష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »