AIAWU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి

జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి:


తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కమిటీ హాల్ దగ్గర ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని కూలీలు, టీచర్లతో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏం.ఆంజనేయులు మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా రామ్ గ్రామంలో వెనుకబడిన ఓ పేద కుటుంబంలో జన్మించింది.చిన్న వయసులోనే మహాత్మ జ్యోతిరావు పూలేతో వివాహం జరిగిందనీ అన్నారు.చదువు రాని సావిత్రిబాయి ఫూలేకు జ్యోతిరావు పూలే గురువుగా మారి చదువు నేర్పిన నాటి సాటి మహిళలకు మరియు దళిత,గిరిజన ,వెనుకబడిన పేద వర్గాలకు చదువు నేర్పుతున్న క్రమంలో ఆనాటి బ్రాహ్మణ ఇజం సావిత్రిబాయి ఫూలేను చదువు చెప్పనీయకుండ ఆటంకాలు పరుస్తూ,అవమానాలు చేసినా,వారికి తల వంచకుండా చదువులు నేర్పిన భారతదేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. అంతే కాకుండా అంటరానితనానికి వ్యతిరేకంగా, స్త్రీ పురుషుల సమానత్వానికై, వితంతు వివాహాలను చేస్తూ సాంఘిక సంక్షేమ పథకాల అమలు కోసం నాటి పాలన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు నడిపిన యోధురాలు. మహారాష్ట్ర లో ప్లేగు వ్యాధితో మరియు కరువు కాటకాలతో ఈనాడు జనం చనిపోతూ ఉంటే, వారికి వైద్యాన్ని అంది స్తూ జోల పట్టి ఆహారా ధాన్యాలను సేకరించి రోజు రెండువేల మందికి ఆహారాన్ని వడ్డించి పెట్టిన మహాసేవకురాలు సావిత్రిబాయి పూలే. వారి ఆశయాలను కొనసాగింపులో భాగంగానే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు, పని దినాలు పెంచాలని, పేదలకు రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర సరుకులు ఇవ్వాలని, భూమిలేని పేదలకు, ఇల్లు లేని పేదలకు, ఇల్లు భూమి పంపిణీ చేయాలని, అంటరానితనం పోవాలని కష్టజీవుల రాజ్యం రావాలని దాన్ని లక్ష్యసాధనకు కష్టజీవులను ఏకం చేసి పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యమ్మ, లక్ష్మి, సునీత, శ్రీనివాసులు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »