పుట్టింటి కానుక అందజేసిన సర్పంచ్ నవీన్ గౌడ్

పుట్టింటి కానుక అందజేసిన సర్పంచ్ నవీన్ గౌడ్


జ్ఞానతెలంగాణ, హత్నూర :

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని
మాధుర గ్రామ సర్పంచ్ గౌండ్ల నవీన్ గౌడ్ తన ఉదారతను చాటుకున్నారు. గ్రామానికి చెందిన మాదిగ నీలమ్మ-భూమయ్య దంపతుల కుమార్తె వివాహ వేడుక ఆదివారం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
​గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, పేద కుటుంబాల్లో జరిగే వివాహాలకు అండగా ఉంటానని చెప్పిన మాట ప్రకారం.. సర్పంచ్ నవీన్ గౌడ్ వధువుకు 10,116 రూపాయలను “పుట్టింటి కానుక”గా అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ:
​గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైనప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం నా బాధ్యత. ముఖ్యంగా ఆడబిడ్డల పెళ్లిళ్ల సమయంలో పుట్టింటి వారు ఇచ్చే కానుకగా ఈ నగదును అందజేస్తున్నాను. గ్రామంలోని పేద కుటుంబాలకు ఎల్లప్పుడూ నా వంతు సహకారం ఉంటుందని అన్నారు.,
​ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొని సర్పంచ్ చేసిన ఈ గొప్ప కార్యానికి హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలుస్తున్న నవీన్ గౌడ్ తీరును అందరూ కొనియాడారు.

You may also like...

Translate »