సాలూర లైబ్రరీని సందర్శించిన సంఘసేవకురాలు సరోజనమ్మ .


జ్ఞాన తెలంగాణ – బోధన్
ప్రముఖ సంఘసేవకురాలు, రాష్ట్ర గవర్నర్ చే అవార్డు పొందిన సరోజనమ్మ మంగళవారం సాలూర మండల కేంద్రంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం (లైబ్రరీ)ని సందర్శించారు. లైబ్రరీలో పాఠకుల కోసం ఏఏ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో పరిశీలించారు. లైబ్రరీ నిర్వహణ, లైబ్రరీకి కావలసిన సౌకర్యాలపై నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీకి వచ్చే పాఠకుల సౌకర్యార్థం మరుగుదొడ్లు నిర్మించడానికి సహకారం అందించాలని కమిటీ సభ్యులు కోరగా ఆమే సానుకూలంగా స్పందించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కావలసిన ప్రతిపాదన పంపితే చేయూతనందిస్తానని ఆమే తెలిపారు.ఈ సంధర్బంగ సాలూరలో లైబ్రరీ ఏర్పాటుచేసిన సంధర్బంగ నిర్వహకులను అభినందించారు.ఆమేవెంట లైబ్రరీ అభివృద్ది కమిటి ప్రధాన కార్యదర్శి లింబూరి లక్ష్మణ్, లైబ్రరీ శాశ్వత సభ్యులు సలహాదారులు సింగడి పాండు, కే.జీ గంగారాం, ఇల్తెపు గంగారాం, అద్దంకి ఊషన్ ఉన్నారు.

You may also like...

Translate »