సర్దార్ నగర్ పంచాయతీ సెక్రెటరీనీ సస్పెండ్ చేయాలి

  • గ్రామపంచాయతీ కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న సర్దార్ నగర్ పంచాయతీ సెక్రెటరీనీ సస్పెండ్ చేయాలి….
  • సిఐడియూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 04:

షాబాద్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ముందు సర్దార్ నగర్ గ్రామపంచాయతీ కార్మికులు పంచాయతీ కార్యదర్శి నీ సస్పెండ్ చేయాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు కట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి తొలగించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేస్తుందని అన్నారు.
గ్రామపంచాయతీ కార్మికులు చాలీచాలని జీతాలతో పని చేస్తూ, గ్రామ ప్రజలు అంటు రోగాల బారిన పడకుండా గ్రామానికి సేవ చేస్తున్నారని,అలాంటి వారి వేతనాలు అక్రమంగా కట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న సర్దార్ నగర్ పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్,జిల్లా పంచాయతీ అధికారి నీ డిమాండ్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గం లో నోటీసులు ఇచ్చి తొలగిస్తామని బెదిరించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని, కానీ సర్దార్ నగర్ లో మాత్రం కార్మికులకు నోటీసులు ఇచ్చి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ గ్రామపంచాయతీ కార్మికులు నరసింహ, పాపయ్య, శోభ ,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »