ఖాబర్దార్ రఘునందన్ రావు : కోనాయిగారి సంతోష్ కుమార్.

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది మే 02.

బుధవారం రోజు నారాయణరావుపేట మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బిఆర్ఎస్ పార్టీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నారాయణరావుపేట మండల ఎంపీపీ ఉపాధ్యక్షులు కొనాయగారి సంతోష్ కుమార్ అన్నారు.

నారాయణ రావుపేట మండల కేంద్రంలో గురువారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో నారాయణ రావుపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా మాజీ మంత్రి హరీష్ రావు కోట్ల రూపాయలతో నారాయణ రావుపేట మండలాన్ని అభివృద్ధి చేసారని అన్నారు.

2014లో ఎంపీగా నిలబడ్డ రఘునందన్ రావు అప్పుడు నారాయణ రావుపేట గ్రామ ప్రజలకు కన్పిస్తే ఇప్పుడు బిజెపిలో చేరి గ్రామ ప్రజలకు ఇప్పుడే కన్పించావు అలాంటి నిన్ను నమ్మి ఓటు వేసే స్థితిలో ప్రజలు లేరని వాపోయారు.

బుధవారం రోజు నారాయణ రావుపేట గ్రామంలో మాట్లాడుతూ ఎంపీటీసీ మా వాడు అంటూ అన్నారు జీవితంలో ఇంత వరకు ఒక్కసారైనా రఘునందన్ తో మాట్లాడినట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్దమని కొనాయి గారి సంతోష్ కుమార్ అన్నారు పనికిరాని విమర్శలు, చౌకబారు అడ్డగోలు మాటలు మాట్లాడడం కేవలం రఘునందన్ రావు తో మాత్రామే అవుతాయని మండిపడ్డారు. చైతన్య వంతమైన నారాయణ రావుపేట గడ్డ ముమ్మాటికీ ఎల్లప్పుడూ హరీష్ రావు వెంటే ఉంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంభలా ఎల్లారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొనాయగారి ఎల్లయ్య, ఎంపీటీసీలు ఆకుల హరీష్, స్వప్న ప్రభాకర్, గ్రామ అధ్యక్షులు కొంగరి దేవరాజు, గుడి చైర్మన్ పూసల కిషన్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దీకొండ భాస్కర్, జిల్లా సీనియర్ నాయకులు బొంగురపు రఘుపతి రెడ్డి, కొంగరి స్వామి, అశోక్, గ్రామ ఉపాధ్యక్షులు బాలయ్య, బిఆర్ఎస్వి అధ్యక్షులు ఋషి, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »