నవాబుపేటలో ఇసుక దందా

నవాబుపేటలో ఇసుక దందా
-100కు డయల్ చేసిన గ్రామస్తులు
-స్పందించిన పోలీసులు
-రెండు ట్రాక్టర్లు సీజ్
జ్ఞానతెలంగాణ, చిట్యాల:
నవాబుపేటలో గత కొంతకాలంగా ఇసుక దందా కొనసాగుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్వ శరత్ తాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనుచరుడినంటూ..గత కొంతకాలంగా ఇసుక దందాకు తెర లేపాడు. నవాబుపేట గ్రామ శివారు వాగులో నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుకను పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న తరుణంలో గ్రామస్తులంతా కలిసి 100కు డయల్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన పోలీసులు ఎట్టకేలకు సర్వ శరత్ కు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో.. నాటి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇసుక దందాపై ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఆయన అనుచరుడినంటూ..ఇసుక దందాను అక్రమంగా కొనసాగిస్తున్న సర్వ శరత్ పై ఎమ్మెల్యే చర్యలు తీసుకొని, ఇసుక దందాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.