తాండూరులో ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 30:
నాగిరెడ్డిపేట్ మండలం తాండూరులో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్ధంగా గ్రామంలోని మహిళలు, యువతులు పలు రకాల పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించి, గ్రామ వీధుల్లో ఉంచి ఆడిపాడుతూ సంబరాలు జరుపుకున్నారు.పూల వర్ణరంజిత అందంతో అలరారిన బతుకమ్మలు గ్రామానికి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. మహిళలు పాడిన బతుకమ్మ పాటలు చూసే వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నవాళ్ళు నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ పాల్గొని ఆనందంగా సద్దుల బతుకమ్మను జరుపుకున్నారు.తరువాత బతుకమ్మలను గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేయగా, ఆ దృశ్యం మరింత ఆహ్లాదకరంగా మారింది. పూలతో, పాటలతో, నృత్యాలతో తాండూరులో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.