ముంపు ప్రాంతాలలో పర్యటించిన

ముంపు ప్రాంతాలలో పర్యటించిన
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా మిథుల నగర్, జై భవాని నగర్ కాలనీల లో పర్యటించి అక్కడ వారి సమస్యల్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు.ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,నాయకులు, మహిళా నాయకురాళ్లు , టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.