పేట లో ఎస్.రాజేందర్ రెడ్డి గారి రోడ్డు షో:

‘పేట లో ఎస్.రాజేందర్ రెడ్డి గారి రోడ్డు షో:
ఙ్ఞాన తెలంగాణ, నారాయణ పేట టౌన్, మే 3:
నారాయణ పేట జిల్లాలోని ఈరోజు అనగా శుక్ర వారం ఉదయం 10 గంటల సమయం లో స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి విగ్రహం నుండి పాదయాత్రగ రోడ్డు షో నిర్వహించారు. మండుటెండలో సైతం ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి తరుపున ప్రచారం నిర్వహించిన మాజీ శాసనసభ్యుడు ఎస్.రాజేందర్ రెడ్డి గారు.
ఇట్టి కార్యక్రమంలో ఎస్.రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ నారాయణ పేట జిల్లాను కేసీఆర్ గారి హయాంలో ఏర్పాటు చేశారని అట్టి నారాయణ పేట జిల్లాను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలగిస్తామని చెప్పడం ఎంతో భాద గ ఉందని ఆయన పేర్కొన్నారు. నారాయణ పేట జిల్లా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్.అభ్యర్థి శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారిని ఆద్యాధిక మెజారిటీ తో గెలిపించాలని అప్పుడు గాని కాంగ్రెస్ పార్టీలో చలనం వస్తోందని ఆయన తెలిపారు. రోడ్డు షో లో ప్రతి ఒక్కరికీ పలకరించుకుంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భారీగా బి.ఆర్.ఎస్. పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.