తుప్పు పట్టిన ప్రభుత్వ వాహనాలు

తుప్పు పట్టిన ప్రభుత్వ వాహనాలు
పలు శాఖల కార్యాలయాల్లో తుప్పు పట్టి ఉన్న వాహనాలు.
జ్ఞాన తెలంగాణ – బోధన్
ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో వివిధ పనులపై అభివృద్ది పనులను పర్యవేక్షిండానికి కార్యక్రమాల్ల పాల్గొనడానికి గత ప్రభుత్వాలు అధికారులకు ప్రత్యేక వాహనాలను కేటాయించారు.దాంతో కొన్ని సంవత్సరాల వరకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించుకున్న అధికారులు అవి రిపేర్ కు రాగానే వాటిని షెడ్డులోనే పక్కన పెట్టేశారు.
దాంతో సంవత్సరాల తరబడి ప్రభుత్వ వాహనాలు మరమ్మతులకు నోచుకోక తుప్పు పట్టి పోయాయి.ప్రస్తుతం అవి దేనికి పనికి రాకుండా పోవడంతో వృధాగా మారిపోయాయి.బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో, గ్రామీణ నీటిపారుదల శాఖ కార్యాలయంలో రెండు వాహనాలు తుప్పుపట్టి వృధాగా మారాయి.ప్రభుత్వ వాహనాలు మూలనపడడంతో అధికారులు అద్దె వాహనాలను ఉపయోగిస్తున్నారు.