పల్లెప్రకృతివనం దగ్ధం..

పల్లెప్రకృతివనం దగ్ధం..
జ్ఞాన తెలంగాణ – బోధన్
గ్రామస్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం గ్రామాలలో ఏర్పాటుచేసిన పల్లెప్రకృతివనం నిరాదరణకు గురవుతున్నాయి. కనీసం వాటిని పట్టించుకునే నాధుడే లేరు. సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటుచేసిన పల్లెప్రకృతి వనం గతంలోనే పాలకులు అస్తవ్యస్తంగా ఏర్పాటుచేశారు. అది ఏర్పాటుచేసినప్పటి నుంచి అందులో ఎవరు కూడా సేదతీరిన సందర్బం లేదు. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం పల్లె ప్రకృతి వనంలో గుర్తుతెలియని వ్యక్తలు నిప్పు పెట్టడంతో చెట్ల మొదళ్లు కాలిపోయాయి. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పల్లె ప్రతివనం చెట్లు అగ్నికి అహుతి అయిన పట్టించుకునేవారు లేరు. కావున అధికారులు దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.