వివిధ సమస్యల పై స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని కలిసిన చర్ల మండలం పులి గుండాల వాసులు…

వివిధ సమస్యల పై స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని కలిసిన చర్ల మండలం పులి గుండాల వాసులు…
జ్ఞాన తెలంగాణ / భద్రాద్రి/ చర్ల న్యూస్.మే 21:
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్ల మండలం పులి గుండాల గ్రామ వాసులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని కలిసి వారి సమస్యలు తెలియజేశారు. వారి సమస్యలు చెక్ డ్యాం, త్రీఫేస్ కరెంట్ మరియు ట్రాన్స్ఫార్మర్, నీళ్ల బోర్లు , చింతకుంట గ్రామం లో ప్రభుత్వ పాఠశాల, పోడు భూములు సమస్యలు ఉన్నాయని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి తెలియజేశారు. ఎన్నికల కోడ్ తదనంతరం అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం డి నవాబ్,గాడి విజయ్, చర్ల మండల నాయకులు కోస. రాజు,మాజీ ఎంపిటిసి అల్లం ఈశ్వర్,బొల్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు…
