ఏకసభ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు వినతి పత్రం అందజేసిన కొమ్ము చెన్నకేశవులు మాదిగ
జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు వాటా దక్కేలా రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని MRPS వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ విజ్ఞప్తి చేశారు. నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎస్సీ వర్గీకరణ మీద బహిరంగ విచారణకు వచ్చేసిన డాక్టర్ జస్టిస్ షామీమ్ అక్తర్ గారికి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో కలసి తెలంగాణ రాష్ట్రంలో SC వర్గీకరణను వెంటనే అమలు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహజన్ సోషలిస్టు పార్టీ MSP వనపర్తి జిల్లా కన్వీనర్ అజ్జపాగ లక్ష్మణ్ మాదిగ,MRPS అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ (MSP)వనపర్తి జిల్లా నాయకులు,MRPS,MSP,MSF నాయకులు తదితరులు పాల్గొన్నారు