నిరుపేద కుటుంబానికి అండగా రత్న సాన్వి వెల్ఫెర్ సొసైటీ

నిరుపేద కుటుంబానికి అండగా రత్న సాన్వి వెల్ఫెర్ సొసైటీ
అంత్యక్రియలకు తక్షణ సహయార్ధం 5000 అందజేసి మానవత్వాన్ని చాటిన రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు
జ్ఞాన తెలంగాణ మే 20
గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బేంబేరి స్వరూప (38)గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతు సోమవారం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న రత్న సాన్వి వెల్ఫెర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయార్థం రత్న సాన్వి వెల్ఫర్ సొసైటీ ద్వారా గ్రామ పెద్దల సమక్షంలో సోమవారం 5 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. తన తల్లి జ్ఞాపకార్థం సొసైటీ ద్వారా పేదలకు సేవలు అందించుటకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని అయన అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి మనో ధైర్యాన్నిచ్చారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీరంగ్, విష్ణు కాంత్, కేశవ్, మాజీ సర్పంచ్ సుభాష్, బలవంత్, రాహుల్ తదితరులు ఉన్నారు