మైనర్ బాలికపై అత్యాచారం

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 31:

చేవెళ్లలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై గర్భవతిని చేసిన ఘటన చేవెళ్ల పట్టణకేంద్రంలో జరిగింది. పోలీసుల వివరాలు ప్రకారం.చేవెళ్ల పట్టణానికి చెందిన పదవ తరగతి చదువుతున్న మైనర్ (17 సంవత్సరాలు) బాలిక, స్కూల్ కి వెళ్తున్న క్రమంలో చేవెళ్ల గ్రామానికి చెందిన కొజ్జంకి సుదర్శన్ వయస్సు 35 సంవత్సరాలు. గల వ్యక్తి బాలికని స్కూల్లో దింపుతానని చెప్పి గత కొంతకాలం నుండి బాలికను తన కారులో ఎక్కించుకొని చేవెళ్ల పరిధిలో గల నిర్మానుష ప్రదేశంలోకి తీసుకెళ్లి బలవంతంగా మైనర్ బాలికను శారీరకంగా కలిసినాడు, ఈ విషయాన్నీ ఎవరికి చెప్పకూడదని బాలికను బెదిరించాడని . ఈ విధంగా బాలికను తన కారులో ఎక్కించుకొని బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డడని . ఈ ఘటనకు పాల్పడిన కోజ్జంకి సుదర్శన్ పై తేదీ 28.05.20 24 నాడు, రేపు మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, శుక్రవారం తేదీ 31.05. 2024 న చేవెళ్ల పోలీసులు కొజ్జంకి సుదర్శన్ ను, నేరానికి ఉపయోగించిన కారును సీజ్ చేసి, అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం, జైలుకి తరలించడం జరిగిందని చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు.

You may also like...

Translate »