తెలుగు ప్రజలపై చెరగని ముద్ర రామోజీరావు

రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు

రామోజీరావు పార్దీవ దేహనికి
నివాళులు అర్పించిన

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

మీడియా,సినిమా,వ్యాపార, విద్య రంగాలలో తనదైన చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్దీవ దేహం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు.రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అన్నారు. వారి మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని విచారం వ్యక్తం చేశారు.సాధారణ వ్యక్తిగా జీవనం ప్రారంభించి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ అతిపెద్ద వ్యాపారవేత్త గా ఎదిగారన్నారు.

తాను ఏర్పాటు చేసిన వివిధ సంస్థల ద్వారా లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. పాత్రికేయ సమాజానికి ఒక దిక్సూచిగా ఈనాడు పత్రిక ద్వారా ఉన్నత ప్రమాణాలు పాటించారన్నారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా గర్వపడే విధంగా ఎంతో అద్భుతమైన ఫిల్మ్ సిటీ ని నిర్మించిన ఘనత కూడా రామోజీరావు గారికే దక్కుతుందన్నారు.

ప్రజాహితం,సమాజహితం కోసం కృషి చేసిన రామోజీరావు మృతి ఒక్క తెలుగు ప్రజలకే కాకుండా దేశానికి కూడా తీరని లోటన్నారు.కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రామోజీరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు,జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ,మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »