ప్రయివేటు డీగ్రీ కళాశాల యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జెలతో ర్యాలీ

ప్రయివేటు డీగ్రీ కళాశాల యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జెలతో ర్యాలీ

  • సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందిస్తున్నప్రయివేటు డిగ్రీ కళాశాలల యూనియన్ నాయకులు.

జ్ఞాన తెలంగాణ – బోధన్ : గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని, రాష్ట్ర ప్రైవేట్ పీజీ , డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నాల్గవ రోజు బోధన్ పట్టణంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ ఎదుట బైఠాయించారు.అనంతరం సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. గంగాధర్ మాట్లాడుతూ తమకు రావలసిన బకాయి డబ్బులు న్యాయంగా మంజూరి చేయాలని నిరసన చేస్తున్నామని అంతేకాని విద్యార్థులను ఇబ్బందులు పెట్టాలని తమ అభిమతం కాదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీల నిర్వహణ భారంగా మారిందని అందుకొరకు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల నిరవధిక బందుకు పిలుపునిచ్చి ప్రతిరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తక్షణమే ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేసినట్లయితే విద్యార్థులకు రాబోయే రోజులలో నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంటుందని తెలిపారుఈ కార్యక్రమంలో పట్టణంలోని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ప్రిన్సిపాల్ లు హరికృష్ణ , శ్రీధర్ రాజు,షేక్ రషీదుద్దీన్, అధ్యాపకులు శ్రీకాంత్, దత్తు, శేఖర్ ,పవన్ ,నితిన్, దశరథ్ ,శ్రీనివాస్ ,హనుమంతు ,అంజాద్ ,నమ్రత, తేజస్విని పాల్గొన్నారు .

You may also like...

Translate »