రఘురాం రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి.

రఘురాం రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి.
- రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కట్ల సంతోష్
జ్ఞాన తెలంగాణ మే 9, వైరా/ఖమ్మం జిల్లా బ్యూరో: కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్ది రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ… రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కట్ల.సంతోష్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5,6 వార్డుల నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13వ తారీకు జరిగే లోకసభ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్దించారు. ఈ సందర్బంగా కట్ల సంతోష్ మాట్లడుతూ..దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తద్వారా వారి జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి రంగారావు, పూర్ణ, బొగ్గారపు రామారావు, ఆవుల రవి, ఒక్కరేని లింగయ్య, కోలా వంశీ తదితరులు పాల్గొన్నారు.