నాణ్యత పాటిస్తూ కష్టమర్ల ఆదరణ పొందాలి

నాణ్యత పాటిస్తూ కష్టమర్ల ఆదరణ పొందాలి
గాయత్రీ రెస్టారెంట్ ను ప్రారంభించిన
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జ్ఞాన తెలంగాణ (మహేశ్వరం)
కస్టమర్లు తినే ఆహారం నాణ్యత పాటిస్తూ వారి ఆదరణ పొందాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మాన్ సాన్ పల్లి చౌరస్తాలో మహేశ్వరం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో
నూతన గాయత్రీ రెస్టారెంట్ ను
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నాణ్యత పాటిస్తూ కస్టమర్లకు ఎప్పుడో ఒకే విధంగా నాణ్యత తో కూడిన ఆహారం అందించాలని
కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆదరణ పొందుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంబయ్య, హనుమగాళ్ల చంద్రయ్య, కర్రోళ్ళ చంద్రయ్య,
పాండు యాదవ్, ఎన్డి తండా రాజు నాయక్,యాదయ్య, రమేష్,తదితరులు పాల్గొన్నారు.