ఏజెన్సీలో అసైన్ భూములకు విద్యుత్తు సరఫరా అందించండి

ఏజెన్సీలో అసైన్ భూములకు విద్యుత్తు సరఫరా అందించాలని,హక్కు పత్రాలు ఇవ్వాలని,రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కనీస అవసరాలను ఎస్సీ,బీసీ ఓబీసీ,మైనారిటీలకు కల్పించాలని డిప్యూటీ సిఎం మల్లు. భట్టి విక్రమార్క కు వినతి పత్రం అందజేసిన తగరం.రాంబాబు, స్వేరో మంగరాజు.
జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్: తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కనీ దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు స్వేరోస్ జిల్లా కోఆర్డినేటర్ మంగరాజు ఆధ్వర్యంలో కలిసి తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ ప్రాంతంలో దళిత గిరిజనేతరులకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు రిజర్వేషన్ అమలు చేయాలని అలాగే ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రస్తుతం దళిత గిరిజనేతరుల సాగులో ఉన్న అసైన్మెంట్ భూములకు విద్యుత్ సరఫరా చేయాలని 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారం పోడు భూములకు సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని జీవో నెంబర్ త్రీ వల్ల 20 సంవత్సరాల ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన నిరుద్యోగులకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గతంలో ఉన్న జీవో నెంబర్ 129 జీవో నెంబర్ 971 జీవో నెంబర్ 41 యధావిధిగా అమలు చేయాలని తదితర విషయాలను మెమొరండం ద్వారా తెలియజేయడం జరిగింది అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానన్నారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వేరో కోఆర్డినేటర్ కలపాల మంగరాజు దళిత నాయకులు చిట్టూరు వెంకట్ దళిత సంక్షేమ సంఘం యువజన నాయకులు గంధం బోస్ అరవింద్ రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.