గ్రామాల్లో పడకేసిన సమస్యలు..

గ్రామాల్లో పడకేసిన సమస్యలు..
–చుట్టపు చూపుగా వచ్చిపోతున్న గ్రామ ప్రత్యేకాధికారులు.
–గ్రామంలో సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న ప్రత్యేక అధికారులు.
ఫోటోలు. వీధి దీపాలు లేక చీకటిగా ఉన్న బిక్నెల్లి గ్రామం.
జ్ఞాన తెలంగాణ – బోధన్
గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు పూర్తవడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పాలనను తెచ్చింది. దాంతో గ్రామంలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టవలసిన గ్రామ ప్రత్యేక అధికారులు తమకేమీ పట్టనట్లు చుట్టపు చుపుగా వచ్చి పోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఒకవైపు వారు పని చేసే కార్యాలయంలో పనుల బిజి వలన గ్రామ పంచాయతీలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటానికి సమయం కేటాయించలేకపోతున్నారు. దాంతో ఒకవైపు నిధులు లేక, మరోవైపు గ్రామ ప్రత్యేకాధికారులు గ్రామాల సమస్యలపై దృష్టి సారించలేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. బోధన్ మండలంలోని పలు గ్రామాలలో సమస్యలు తాండవిస్తున్నాయి.
గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగిసిపోయి నెలలు గడుస్తుండడంతో ప్రభుత్వం ప్రత్యేక గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అంత వరకు బాగానే ఉన్న గ్రామ ప్రత్యేక అధికారులు సమయానికి గ్రామానికి రాక గ్రామంలోని సమస్యలు పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
చెప్పుకుందాం అంటే ప్రత్యేక అధికారులు సమయానికి ఉండడం లేదని, గ్రామపంచాయతీ కార్యదర్శులు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బోధన్ మండలానికి మారుమూల గ్రామమైన బిక్నెల్లి, కొప్పర్గా గ్రామంలో సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. బిక్నెల్లి గ్రామంలో గత రెండు రోజులుగా విద్యుత్ దీపాలు రాక కరెంటు సరఫరా లేక చీకటిలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. దాంతో తాగునీరు సైతం లభించక తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తుల పేర్కొన్నారు .
అలాగే కొప్పర్గ గ్రామంలో నిధులు లేక పారిశుధ్యం ఇబ్బందిగా మారింది. పేరుకే గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు కానీ గ్రామంలోని సమస్యలను పట్టించుకోవడంలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు కావున అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు