దుమ్ముగూడెం మండలం కొమరం భీమ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు


జ్ఞాన తెలంగాణ/ దుమ్ముగూడెం న్యూస్. మే 20:
కొమరం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ చిన్న బండి రేవు మరియు డీ కొత్తూరు తలపడగా చిన్న బండి రేవు విజయం సాధించింది. రన్నర్ గా ఢీకొత్తూరు, మూడో బహుమతి దేవరపల్లి నాలుగో బహుమతి పెద్ద బండి రేవు టీమ్ లకు బహుమతులను భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు అందజేశారు.ఆయన మాట్లాడుతూ క్రీడల పట్ల యువత ఆసక్తి చూపాలి. క్రీడల వల్ల ఆరోగ్యానికి మంచి శక్తి లభిస్తుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం జడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఎంపిపి రేసు లక్ష్మి , స్థానిక సర్పంచ్ తెల్లం వరలక్ష్మి, ఎంపీటీసీ తెల్లం భీమరాజు, సేవాదళ్ అధ్యక్షులు పిలక వెంకటరమణ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరమాచినేని వినీల్, మాజీ అధ్యక్షులు లంక అబ్బులు, దర్శి సాంబశివరావు, సీనియర్ నాయకులు కొమరం దమోదర్ రావు, గొల్లపూడి కోరయ్య, సకినం సతీష్, యువజన కాంగ్రెస్ నాయకులు తెల్లం హరికృష్ణ, పొడియం జానీ, కంచు శ్రీధర్, గజేంద్ర, బెనర్జీ, మండల నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు…

You may also like...

Translate »