ప్రైవేట్ క్లినిక్ లు నిబంధనలు పాటించాలి


నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం రాథోడ్.

జ్ఞాన తెలంగాణ – బోధన్


ప్రైవేట్ క్లినిక్ లు, ల్యాబ్ లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆయన బోధన్, కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ లను, ఆప్టికల్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల వారు
ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలని, వైద్య ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలని అన్నారు. లేనియెడల చట్టరీతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్లు,
పేషంట్లకు ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. వైద్యుల విద్యార్హతలను, విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించారు. కోటగిరి, పోతంగల్ ఆసుపత్రులలో భద్రపరిచే ఫ్రిజ్ లను పరిశీలించారు. హెల్త్ వెల్నెస్
సెంటర్ల లలో అన్ని రకాల సేవలు అందించాలని సూచించారు.ఆయన వెంట జిల్లా ఉప వైద్య అధికారిని డాక్టర్ విద్య తో పాటు సూపర్వైజర్ నిర్మల, సుజాత, వైద్య సిబ్బంది నాగరాజు ఉన్నారు.

You may also like...

Translate »