జ్ఞాన తెలంగాణ,జఫర్ గడ్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జఫర్ గడ్ మండల కార్యాలయంలో అందరు పంచాయతి కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి వేసవి కాలంలో త్రాగు నీటి కి సంబంధించి గ్రామాలలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని తెలపడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గ్రామాలలో ఫీల్డ్ విజిట్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే గుర్తించి వాటిని పరిష్కరించాలని తెలపడం జరిగింది . ఈ కార్యక్రమంలో AE/RWS సుకన్య గారు, AE Grid విజయ లక్ష్మి గారు, MPDO(FAC) సుమన్ గారు మరియు అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.