వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం.
జ్ఞాన తెలంగాణ టేకుమట్ల.
భూపాలపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు , పట్టభద్ర ఓటర్ల సమావేశం 23/05/2024 రోజున భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 10గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరు కానున్నారు. కావున మండలంలోని బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షులు, నియోజకవర్గంలోని బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీపీలు, జడ్పిటిసి లు, ఎంపిటిసిలు,సర్పంచులు,మండల అధ్యక్షులు,గ్రామాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు,యువకులు, మహిళలు,పట్టభద్ర ఓటర్లు అందరూ తప్పకుండా ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరై మన నాయకుడు హరిశన్న పర్యటనను విజయవంతం చేయగలరని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు తెలంగాణ వెంకటేశ్వరరావు కోరారు.