ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ప్రజ్ఞ శ్రీ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం.


జ్ఞాన తెలంగాణ- బోధన్


సాలూర మండల కేంద్రంలో గల ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థులు మంగళవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు .నలుగురు విద్యార్థులు 10/10 జిపిఏ, మరో నలుగురు విద్యార్థులు 9.8 జిపిఏ ,అలాగే పది మంది విద్యార్థులు 9.7 జిపిఏ, 39 విద్యార్థులు 9.0 జిపిఏ సాధించి ప్రభంజనం సృష్టించారు. దాసరి సింధుజ 10/10, బుర్రసాక్షి 10/10, ఇనాందార్ రాధిక 10/10, బిర్దార్ రోహిత్ 10/10 జీపీఏ సాధించి ప్రభంజనం సృష్టించారు. దాంతో పాఠశాలలో 99 శాతం ఉత్తీర్ణత నమోదయిందని, ఎస్ఎస్సి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు కరస్పాండెంట్ లతా రాజు అభినందించారు.

You may also like...

Translate »